KoloKolannaKolo(కోలో కోలన్న కోలో) Song Lyrics in Telugu & English| Tuck Jagadish Movie Songs
Song Name | KoloKolannaKolo Lyrical | Tuck Jagadish Songs | Nani | Shiva Nirvana | Armaan Malik | Thaman S |
Singer(s) | Armaan Malik , Harini Ivvaturi Sri krishna & thaman S |
Lyricist(s) | Seetharama sastry |
Album | Tuck Jagadish |
Music Label | AdityaMusic (on behalf of Aditya Music (India) Pvt. Ltd.); LatinAutorPerf, and 4 Music Rights Societies |
కోలో కోలన్న పాట లిరిక్స్(Song Lyrics) : తెలుగు
కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి...
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి...
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏవుంది
చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీ వెంట కడ దాకా నేనుంటా
రాళ్ళైనా ముల్లైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే...
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా...
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే...
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా...
కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి...
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి...
చిన్న చిన్నా ఆనందాలు...చిన్నబోని అనుబంధాలు
అప్పుడప్పుడు చెక్కిలిగింతలు పెడుతుండగా...
కలత కన్నీళ్లు లేని...చిన్ననాటి కేరింతల్ని
చిటికేసి ఇటు రమ్మంటు పిలిపించగా...
కదిలొస్తోంది చూడు...కన్నుల విందుగా
ఊరందరిని కలిపే...ఉమ్మడి పండుగా
ఆ నలుగురితో చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్న జడిసేన తడిసేన
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే...
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా...
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే...
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా...
నీలోను నాలోనూ ఈ నేలెగా అమ్మాయి ఉంది
అంతా అయినోళ్లే గాని పరులెవ్వరు...
మనలోని చుట్టరికాన్నీ మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరు...
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పది మందికి ఆనందం పంచకపోదుగా...
ఆ…తగిన వరసైన తారక తెరలు విడి దరికి చేరగా
ప్రతినిత్యం పున్నమిగా అనుకోదా నెలవంక
కలలన్ని విరియగా విరిసిన వెన్నెలగా...
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే...
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా...
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే...
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా...
కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి...
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి...
KoloKolannaKolo Song Lyrics in English
Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali...
Kovello Velige Jyothulu Kallallo Koluvundaali...
Aaraaru Ruthuvulloni Akkarlenidhi Emundhi
Choodaale gaani Manne Rangula Poodhotavuthundhi
Thodai Neeventa Kada Dhaaka Nenuntaa
Raallainaa Mullainaa Mana Adugulu Padithe Poolai Pongaalaa
Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte...
Ninu Ventaade Dhigule Velipothundaa...
Yama Dhairyamgaa Edhutelli Niluchunte...
Ninnedhirinche Bedhurinkaa Untundhaa...
Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali...
Kovello Velige Jyothulu Kallallo Koluvundaali...
China Chinna Aanadhaalu…Chinnaboni Anubandhaalu
Apudapudu Chekkiliginthalu Peduthundagaa...
Kalathaa Kanneellu Leni...Chinanaati Kerinthalni
Chitikesi Iturammantu Pilipinchagaa...
Kadhilosthu Undi Choodu...Kannulavindhugaa
Oorandharnee Kalipe...Ummadi Pandugaa
Aaa Naluguritho Chelimi Panchuko
Chirunagavu Sirulu Penchuko
Jadivaane Paduthunnaa Jadisenaa Thadisenaa
Nee Pedhavulapai Chirunavvulu Epudainaa
Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte...
Ninu Ventaade Dhigule Velipothundaa...
Yama Dheemaagaa Edhutelli Niluchunte...
Ninnedhirinche Bedhurinkaa Untundhaa...
Neelonu Naalonu Ee Nelegaa Ammai Undhi
Anthaa Ayinollegaani Parulevvaru...
Manaloni Chuttarikaanni Maripinche Ee Dhooraanni
Cheripe Veelundhante Kaadhanarevvaru...
Oka Puvvu Vichhina Gandham Oorike Podhugaa
Padhimandhiki Aanandham Panchakapodhugaa...
Aa...Thagina Varasaina Thaaraka Theralu Vidi Dhariki Cheragaa
Prathinithyam Punnamigaa Anukodhaa Nelavankaa
Kalalannee Viriyagaa Virisina Vennelagaa...
Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte...
Ninu Ventaade Dhigule Velipothundaa...
Yama Dharjaagaa Edhutelli Niluchunte...
Ninnedhirinche Bedhurinkaa Untundhaa...
Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali...
Kovello Velige Jyothulu Kallallo Koluvundaali...
YouTube Video